కెరీర్ గైడన్స్ వారోత్సవం
నాలుగో రోజు కార్యక్రమాలు
పి . వి. సి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల - వాల్మీకిపురం
కెరీర్ గైడన్స్ వారోత్సవాల్లో నాలుగో రోజు కార్యక్రమాల్లో వృత్తిపరమైన సమాచారం గురించి ఉపాధ్యాయులు నాగేశ్వర, బి.శంకర్, రసూల్ బావాజీ విద్యార్థులకు వివరించారు. వివిధ వృత్తులకు కావాల్సిన నైపుణ్యాలు, విద్యార్హతలు, పని స్వభావం గురించి నాగేశ్వర వివరించారు. జాబ్ కార్డు వివరాలను, కెరియర్ గురించి "వన్ మినిట్ టాక్" కు విద్యార్థులు ఎలా సన్నద్ధం కావాలో రసూల్ బావాజీ విశదీకరించారు. ఎపి కెరియర్ పోర్టల్ లో విద్యార్థులు సమాచారాన్ని ఎలా గ్రహించాలో తెలిపారు. కెరీర్ ను ఎంచుకోవడంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలను బి. శంకర్ తెలియచేశారు .
No comments:
Post a Comment